కాశ్మీరులోయలో సామాన్య పౌరులని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస హత్యల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు క్రీడాశాఖ అయితే బాగుంటుంది అంటూ ఎద్దేవా చేశారు.
” జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అక్కడ నిత్యం ఓ కాశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమీషా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో క్రికెట్ కు అనవసర ఆదరణ బాగా పెరిగిపోయింది.” అంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ వేదికగా హోంమంత్రి పై విమర్శలు చేశారు. కాగా అమిత్ షాను టార్గెట్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి గతంలో కూడా విమర్శలు చేశారు.
Very sad . @AmitShah RESIGN
CC @Swamy39 https://t.co/E6J9BuQKEx— Sanatan Dharma (@HinduDharma1) June 3, 2022