ఆసక్తికరంగా సుధీర్ బాబు హంట్ ట్రైలర్.. ఆ హత్య చేసిందెవరూ..?

-

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం హంట్. భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత వి ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

అలాగే మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, ఘట్టమనేని మంజుల, చిత్ర శుక్ల, మౌనిక రెడ్డి, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రం బృందం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ అధ్యంతం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఈ చిత్రంలో సుధీర్ బాబు మెమరీ లాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. అదిరిపోయే స్టంట్స్ తో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ భరత్ సహా ఇతర ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ చుట్టూ ఉన్న సీన్స్ అదిరే లెవెల్ లో అనిపిస్తున్నాయి. ట్రైలర్ లో సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం హైలెట్ అని చెప్పాలి. ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news