విద్యాశాఖ అధికారులకు జైలుశిక్ష విధించిన ఏపీ హైకోర్టు

-

ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు విద్యాశాఖ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసు అంశాలకు సంబంధించిన కేసులో.. గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ రామకృష్ణను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇద్దరు అధికారులకు నెల రోజుల జైలుశిక్షతో పాటు ₹2వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news