ఏపీ అవతరణదినోత్సవం మార్పు వెనుక అసలు కారణం ఇదే…!

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని సర్కార్‌ జీవో విడుదల చేసింది. అయితే దిని వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తుంది.అవతరణ దినోత్సవం నవంబర్‌ 1నే కొనసాగించాలా లేదా జూన్ 2న అధికారికంగా ప్రకటించాలా అన్న సందిగ్ధంలో పడింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందన్న కారణంతో జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టడం ప్రారంభించింది. అది 8వ తేదీన మహాసంకల్ప దీక్షతో ముగిసేది.

ఒకప్పటి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా, మూడేళ్ల తర్వాత 1956 నవంబర్‌ 1న హైదరాబాద్‌తో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి అవతరణ దినోత్సవాన్ని నవంబర్‌ 1న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే అనవాయితిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు సీఎం జగన్.

దీనిపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరపనున్నారు. రాజ్ భవన్లో జరిగే వేడుకల్లో గవర్నర్‌ పాల్గొంటారు. అలాగే క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుంది. ఇటు జిల్లాల్లో మంత్రులు జెండాలు ఆవిష్కరించనున్నారు.