యంగ్ ఏజ్ వచ్చాక చాలా మంది యువతి యువకులకు మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. శరీరంలో వేడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడే ఈ మొటిమలను తొలగించడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫేస్ ప్యాక్‌లని, క్రీంలని ముఖానికి రాస్తూ ఉంటారు. కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాస్మొటిక్స్ వాడకుండా.. కేవలం సాధారణ పద్ధతులతోనే మొటిమలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
యుక్త వయసులో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుతో ఆహారపు అలవాట్లు మారి.. శరీరంలోని డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరిగి మొటిమలు వాటంతట అవే తగ్గిపోతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ తగ్గకపోతే.. ఇంట్లోనే ఉంటూ ఈ చిట్కాలకు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కలబందలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని ఫేషియల్‌గా కూడా వాడుతుంటారు. కలబంద గుజ్జులో కస్తూరి పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయి.
ముల్తానీ మట్టి, శనగపిండితో కూడా మొటిమలు తగ్గించుకోవచ్చు. వీటిని ఫేస్ ప్యాక్‌గా వాడితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మొటిమల సమస్య కూడా తీరుతుంది. అలాగే సముద్రపు ఉప్పునీటితో కూడా మొటిమలు తగ్గించవచ్చు. సముద్రపు ఉప్పులో కొంచెం తేనే, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. అప్పుడు ఫలితం మీకే కనిపిస్తుంది.
శరీరంలో వేడి పెరిగినప్పుడు, బయట పొల్యూషన్‌లో తిరిగేటప్పుడు ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లి వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న ఆయిల్, మలినాలు తొలగిపోతాయి. ముఖం కడిగిన తర్వాత ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకోమని, ఫ్రూట్స్‌కి సంబంధించిన ఫేస్ ప్యాస్ మొటిమలు తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించకపోతే.. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.