ఏప్రిల్ 17 తర్వాత ఏపీ బడ్జెట్ సమావేశాలు?

Join Our Community
follow manalokam on social media

ఏప్రిల్ 17 తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఈ లోపు బడ్జెట్‌ కోసం ఏపీ సర్కార్ ఆర్డినెన్స్‌ తీసుకు రానుందని తెలుస్తోంది. నిజానికి పరిషత్‌, తిరుపతి ఉప ఎన్నికల ప్రక్రియలు పూర్తి చేసుకుని..బడ్జెట్‌ సమావేశాలకు సిద్ధం కావాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయని అంటున్నారు. మార్చి 31లోపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చులు…రాష్ట్ర శాసనసభ ముందు పెట్టి ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ అనివార్య పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది.

అయితే గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల వల్ల , బడ్జెట్‌ సమావేశాలు పెట్టే అవకాశం ప్రభుత్వానికి చిక్కలేదు. మరోవైపు జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఆరు రోజుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇవి కూడా పూర్తి అయిపోతే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మరి ఒకవేళ పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో పెట్టే పరిస్థితి లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి. 

 

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...