హైదరాబాద్ లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ జరిగింది. రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ హసన్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి హంగామా సృష్టించింది.   కత్తులు, తల్వార్లతో రిజ్వాన్ అనే వ్యక్తి పై దాడి చేశారు. రిజ్వాన్ ను వెంటాడి వెంటాడి తల్వార్లతో దాడి చేయగా గట్టిగా కేకలు వేస్తూ పరుగులు తీస్తూ దుండగుల నుండి తప్పించుకొని మసీద్ లోకి దూరాడు రియాజ్. రిజ్వాన్ కేకలు విని ఇండ్లలో నుంచి బయటకు వచ్చిన స్థానికులని చూసి  అక్కడి నుంచి పారిపోయారు దుండగులు.

రక్తపు మడుగులో పడి వున్న రిజ్వాన్ ను  హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. స్థానికంగా వున్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా పహాడీ షరీఫ్ వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన ఖాద్రీ, దస్తగిరితో పాటు ముగ్గురు వచ్చినట్లు గుర్తించారు.   రిజ్వాన్ కు ఖాద్రీ కి మధ్య డబ్బు పంచాయతీ ఉందని, దీంతో రిజ్వాన్ ను చంపాలని ఖాద్రి పథకం వేసినట్టు గుర్తించారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...