చాలా మంది ఈ మధ్య కాలం లో తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. వీటి ద్వారా మంచిగా డబ్బులు వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వాటిలో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం కేవలం అడ పిల్లలకు మాత్రమే అవుతుంది.
మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. పదేళ్లలోపు వయసు ఉన్న వారు మాత్రమే ఈ స్కీమ్ లో చేరడానికి అవుతుంది. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్ కింద చేరొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం కి కావలసిన డాక్యుమెంట్లు:
బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
పాన్ కార్డు
ఆధార్ కార్డు
పాప ఫోటోలు
పాప ఆధార్ కార్డు
పాప బర్త్ సర్టిఫికెట్
సుకన్య సమృద్ధి యోజన పథకం లో ఎలా చేరాలి?
దగ్గరిలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే చాలు. సుకన్య సమృద్ధి యోజన పథకం లో చేరచ్చు. ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. దీనిలో చేరాక దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది.
ఎంత డబ్బులు ఈ స్కీమ్ లో కట్టాలి?
ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే నెలకు రూ.12,500 వరకు డిపాజిట్ ని ఈ స్కీమ్ లో డిపాజిట్ చెయ్యచ్చు. నెల నెలా ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి అనేది మీ ఇష్టం.
మీరు నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.25 లక్షలకు పైగా వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. తరవాత కట్టాల్సిన అవసరం లేదు. అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు.