అల్లరి నరేష్ పవర్ ఫుల్ “ఉగ్రం” టీజర్ రిలీజ్!

-

అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రొటీన్ కామెడీ చిత్రాలను పక్కనపెట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో పలకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గతేడాది “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” అంటూ డిఫరెంట్ మూవీ తో పలకరించిన అల్లరి నరేష్ అంతకు ముందు “నాంది” అంటూ మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.

ఈ కోవలో నాందితో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు విజయ్ కనకమెడల దర్శకత్వంలో తాజాగా “ఉగ్రం” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ పథకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో మిర్నా తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేయించారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news