కొంగు వెనక్కు విసిరి కోపంగా నడుస్తున్న యాంకర్ సుమ..ఎందుకో తెలుసా?

-

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె..త్వరలో వెండితెరపైన సినీ ప్రేక్షకులను పలకరించనుంది. జనాలను ఇన్నాళ్లు బుల్లితెరపైన ఎంటర్ టైన్ చేసిన..సుమ సిల్వర్ స్క్రీన్ పైన ‘జయమ్మ’గా మెరవనుంది.

వచ్చే నెల 6న యాంకర్ సుమ ప్రధాన పాత్ర పోషించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ను భిన్నంగా చేస్తోంది సుమ. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టినట్టుంది సుమ. హ్యాష్ ట్యాగ్ జయమ్మ ఫోజ్ అనే క్యాప్షన్ తో #JayammaPose.. ప్రతీ ఒక్కరు తన మాదిరిగా కొంగును వెనక్కు నెట్టి సీరియస్ గా నడువాలని, అలా జయమ్మ వాకింగ్ స్టైల్ ను రీ క్రియేట్ చేయాలని చాలెంజ్ చేసింది.

అలా సినిమాలోని తను నడిచిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన సుమ..ఈ చాలెంజ్ లో పార్టిసిపేట్ చేయాలని కోరింది. తొలుత ఆమెనే పార్టిసిపేట్ చేసింది. సిల్వర్ శారీలో ఆమె కూడా అలా జయమ్మ సిగ్నేచర్ వాకింగ్ రీ క్రియేట్ చేసింది.

విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా వెరీ డిఫరెంట్ గా ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా స్పష్టమవుతున్నది. చూడాలి మరి…ఏం జరుగుతుందో..

https://www.instagram.com/reel/CcxZunNJp8l/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news