క్యాష్ షో లో కంటతడి పెట్టిన సుమ..ఆమె వళ్లేనా..?

-

బుల్లితెరకు మకుటం లేని మహారాణిగా.. తనదైన శైలిలో వాక్చాతుర్యంతో చూపర్లను ఆకట్టుకుంటూ ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోయిన యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక సుమ బుల్లితెరపై ఏదైనా ఒక షోలో యాంకర్ గా వ్యవహరిస్తోందంటే చాలు తన యాంకరింగ్ తోనే ఆ షో కి మంచి టిఆర్పి రేటింగ్ ను తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే స్టార్ మహిళ షోతో ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సుమ.. మరొక్కసారి క్యాష్ ప్రోగ్రామ్ తో మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో సుమ ఈ ప్రోగ్రాంలో చేసే సందడి అంతా ఇంకా కాదు. అందుకే ఈ షో కి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. అంతేకాదు ఈటీవీలో ప్రసారమవుతున్న షోలలో జబర్దస్త్ తర్వాత క్యాష్ ప్రోగ్రామ్ అంతటి ఇమేజ్ ని సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇక ఎప్పుడూ అందర్నీ అలరిస్తూ, నవ్విస్తూ ఉండే సుమా ఈసారి మాత్రం కంటపడి పెట్టుకుంది.. ఇక అసలు విషయం ఏమిటంటే.. వచ్చే శనివారం ప్రసారం కానున్న క్యాష్ ప్రోగ్రామ్ కి సీనియర్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక ఇందులో తమదైన పాత్రలతో ప్రేక్షకులను సుదీర్ఘ కాలం పాటు అలరించిన కృష్ణవేణి, సుభాషిని , జెన్నీ.. బాలాజీ లాంటివారు గెస్ట్ గా వచ్చారు. ఇక వీరు కూడా యాంకర్ సుమతో చాలా ఫన్నీగా షో కొనసాగించారు.

ఇక ఈ షోలో భాగంగా అతిథిగా వచ్చిన సుభాషిని తన ఆరోగ్యం పరిస్థితి గురించి చెబుతూ అలాగే సుమా క్యారెక్టర్ గురించి ఊహించని వ్యాఖ్యలు చేసింది. ఇక నేడు నేను ఇలా మీతో సరదాగా ఉండడానికి కారణం సుమే.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నాకు కావలసిన మందులు పంపిస్తూ ఉంటుంది అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. మళ్లీ నాకు మానవ జన్మంటూ ఉంటే నా కడుపున నువ్వే పాపవై పుట్టాలి తల్లి అంటూ ఏడ్చింది. సుమ దగ్గరకి వెళ్లి హత్తుకోగా సుమా కూడా కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news