తల్లి, చిన్నాన్న కూతురు, తండ్రికి ఆత్మ, నీడ.. అందరూ జగనుకు దూరమయ్యారని చురకలు అంటించారు సోమిరెడ్డి. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సెలవు చీటీ ఇచ్చేసింది… జగన్ విడిచిన బాణం షర్మిళ.. జగన్ ముఖం చూడకుండా తెలంగాణకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ జగన్ను జైలుకు పంపిన పార్టీలోనే ఉండిపోయారని… వైఎస్ఆర్ నీడ సూరీడు నీడ జగన్ నుంచి మాయమైందని సెటైర్లు పేల్చారు.
మరో చెల్లి సునీత జగన్ ముఖం చూడడానికి ఇష్టపడడం లేదని.. వైఎస్ నమ్మిన వ్యక్తులే జగన్ను వదిలి వెళ్లిపోతే.. ఇంకా రాష్ట్ర ప్రజలు జగన్ను ఎందుకు నమ్మాలి..? అని నిలదీశారు. వైసీపీ ప్లీనరీ ఒక స్టేజి డ్రామాగా కొనసాగింది… మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో జగన్ పొగిడించుకున్నారు.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమీ చేయలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరిగే అవినీతి, నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని… ఎంతసేపూ ఆత్మస్తుతి, పరనింద అనే విధంగా వైసీపీ ప్లీనరీ జరిగిందని..
ప్లీనరీలో పార్టీ కోసం నిలబడిన వారిని చాలా నిర్లక్ష్యం చేశారన్నారు. 2019 ఎన్నికల సమయంలో చేసిన ప్రచారంలో వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారని.. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఏడు సార్లు పెంచారని ఆగ్రహించారు సోమిరెడ్డి.