Sunil Narine : సునీల్ నరైన్ కు కెప్టెన్సీ బాధ్యతలు

-

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ సునీల్ నరైన్ కు కీలక బాధ్యతలు అప్పగించింది కేకేఆర్‌ టీం. అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్ గా వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ సునీల్ నరైన్ నియమితుడయ్యాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ఐపిఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

గత కొన్ని ఐపిఎల్ సీజన్ల నుంచి సునీల్ నరైన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి అబుదాబి జట్టు పగ్గాలు కేకేఆర్ యాజమాన్యం అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇక టి20 క్రికెట్ లో సునీల్ నరైన్ అద్భుతమైన ఆటగాడు. అతడికి 400కు పైగా టి20 మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో నరైన్ తో పాటు అండ్రీ రస్సెల్, రవి రాంపాల్, అఖిల్ హోస్సేన్, రేమాన్ రిఫర్, కెన్నార్ లూయిస్ వంటి విండీస్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక కెప్టెన్ గా ఎంపికైన అనంతరం సునీల్ నరైన్ స్పందించాడు. అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

Read more RELATED
Recommended to you

Latest news