సూర్యాపేటలో పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు

-

సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. జాతీయ రహదారిపై నెంబర్ ప్లేట్ లేని వాహనాలు అనుమానాస్పదంగా వెళ్తున్నట్లు సమాచారం అందడంతో బస్టాండ్ వద్ద పోలీసులు విచారిస్తుండగా.. దుండగులు ఈ కారుని చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో వాహనానికే తాళం ఉండడంతో సులభంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. కనిపించకుండా పోయిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news