బ్రెజిల్, ఫ్రాన్స్ లో కరోనా టెన్షన్.. మళ్ళీ లాక్ డౌన్ !

-

యూరప్‌ దేశాలను కరోనా థర్డ్‌ వేవ్‌ వణికిస్తున్నది. దీంతో మహమ్మారి కట్టడికి ఆయా దేశాలు మళ్ళీ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌, బ్రెజిల దేశాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ లో అయితే 3 వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ ప్రకటించారు. లోకల్ మూమెంట్ మీద కూడా ఆంక్షలు విధించగా దేశవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు.  కరోనా వైరస్‌ విజృంభణతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన ఫ్రాన్స్‌..మరోసారి లాక్‌డౌన్‌ విధించేందుకు అధ్యక్షుడు సుముఖత చూపలేదు.

coronavirus
coronavirus

లాక్‌డౌన్‌ విధించకుండానే దేశాన్ని ముందుకు నడుపుతానని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. పరిస్థితి దారుణంగా మార్చడంతో మూడోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పలేదు. వైరస్‌ కేసుల్లో మన దేశం మూడోస్థానంలో ఉండగా, ఫ్రాన్స్‌ ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉంది. బ్రెజిల్‌ లో సైతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బారినపడి ఒక్క మార్చి నెలలో 66,570 మంది మృత్యువాతపడ్డారు. అంతకు ముందు మాసాలతో పోలిస్తే మరణాల సంఖ్య రెండింతలు అయింది.  ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కరోనా మరణాల్లో నాలుగో వంతు ఒక్క బ్రెజిల్‌లోనే నమోదవుతోండడం ఆందోళన కలిగిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news