ఎల్ఐసీ లో సూపర్ స్కీమ్.. ఒక్క పాలసీ తో బెనిఫిట్స్ ఎన్నో.. పూర్తి వివరాలు..

-

ప్రముఖ ప్రభుత్వ భీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.అందులో ఎల్ఐసీ బీమా రత్న కూడా ఒకటి..ఈ పాలసీ తీసుకోవడం వల్ల పాలసీదారులు మూడు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.. గ్యారంటీ రిటర్న్ పొందొచ్చు. ఇంకా డెత్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనీ బ్యాక్ పొందొచ్చు. అంటే ఒక్క పాలసీ తీసుకుంటే మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయన్న మాట..

 

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలానుకొనేవారికి ఇది బెస్ట్ చాయిస్..ఈ పాలసీ తీసుకోవాలని భావించే వారు మూడు రకాల ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు ప్రీమియం టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు మీకు నచ్చిన విధంగా ప్రీమియం టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు ఏ టెన్యూర్ ఎంచుకున్నా కూడా నాలుగేళ్ల ప్రీంయం తప్పక చెల్లించాల్సి ఉంటుంది..

అలాగే పాలసీ తీసుకున్న వారికి 25 శాతం చొప్పున డబ్బులు చెల్లిస్తూ వస్తారు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే వారికి 13 వ సంవత్సరం, 14వ సంవత్సరం ఈ మనీ లభిస్తుంది. అదే 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే.. 18వ సంవత్సరం, 19వ సంవత్సరం డబ్బులు పొందొచ్చు. ఇక 25 ఏళ్ల టెన్యూర్ అయితే 23వ సంవత్సరం, 24వ సంవత్సరం డబ్బులు పొందవచ్చు..

ఈ పాలసీని తీసుకోవాలని భావించేవారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి..కనీసం రూ. 5 లక్షల మొత్తానికి బీమా తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తంలో 50 శాతం చెల్లిస్తారు. గ్యారంటీ అడిషన్ లభిస్తుంది. గ్యారంటీ బోనస్ ఉంటుంది. మరోవైపు ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్ లభిస్తుంది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి బీమా మొత్తంలో 125 శాతం అందజేస్తారు. లేదంటే వార్షిక ప్రీమియం మొత్తానికి 7 రెట్లు ఎక్కువగా చెల్లిస్తారు.. లేదా అంతకన్నా ఎక్కువ చెల్లిస్తారు..

ఇక మీరు చెల్లించిన ప్రీమియం మొత్తంలో 105 శాతం కన్నా తక్కువగా చెల్లించకూడదు. ప్రతికూల పరిస్థితుల్లో అటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఇటు పాలసీ టర్మ్‌లో చేతికి డబ్బులు వస్తాయి. ఇంకా మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం పొందొచ్చు.. అంటే ఈ పాలసీని తీసుకుంటే మాత్రం మూడు రకాల బెనిఫిట్స్ ను పొందవచ్చు.. దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయంకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకొని పాలసీని తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news