ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన షర్మిల పార్టీలో చేరబోతున్నారు అనే వార్తలు వెలుపడ్డాయి. ఈ విషయాన్ని పొంగులేటి అనుచరులు ఖండించారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల పొంగులేటి భేటీ పై పూర్తి స్పష్టత ఇచ్చారు. లోటస్ పాండ్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పొంగులేటితో భేటీ నిజమేనని, ఆయన పార్టీ చేరికపై నాకు క్లారిటీ ఇచ్చారని తెలిపారు.
ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుందన్నారు షర్మిల. పొంగులేటి పార్టీలో చేరతానని తనకు మాటిచ్చాడని అన్నారు. ఇక నేడు గవర్నర్ తమిళి సై కి బిజీ షెడ్యూల్ ఉన్న ఒక కారణంగా కలవలేకపోయాను అని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న తమపై అకారణంగా గతంలో దాడి చేశారని, ఆగిన చోటు నుంచే పాదయాత్ర పూర్ణ ప్రారంభం చేస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ అనేక వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని మండిపడ్డారు.