ఆస్ట్రేలియాలో కార్చిచ్చు చేసిన విధ్వంశం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద నాశనం అయిపోగా వేలాది గృహాలు ఈ మంటల్లో మాడి మసిఅయిపోయాయి. కోట్లాది అడవి జంతువులు ఈ మంటల్లో ప్రాణాలు కోల్పోయాయి. సజీవ దహనం అయిపోయాయి అడవి జంతువులు. చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు కూడా ఈ మంటల్లో ప్రాణాలు కోల్పోయాయి.
ఇక బతుకు జీవుడా అంటూ కొన్ని గాయాలతో ఆ మంటల నుంచి బయటపడ్డాయి. మరికొన్ని ఆవాసాలు కోల్పోయి జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనితో అక్కడి ప్రజలు, ప్రభుత్వం వాటికి సేవలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంటల నుంచి తప్పించుకుని, ఆహారం లేక ప్రాణాలు కోల్పోతున్న, కోలా ఎలుగుబంట్లు, కుందేళ్ళు,
తమ జాతీయ జంతువు కంగారు, కోతులు సహా అనేక ప్రాణుల కోసం క్యారెట్లు, స్వీట్ బంగాళదుంపలను హెలికాప్టర్ల ద్వారా అవి ఉండే ఆవాస ప్రాంతాల్లో జార విడుస్తున్నాయి. వేలాది టన్నుల కూరగాయలను వాటి కోసం జార విడుస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రజలు కూడా వాటి కోసం తమ వంతుగా కూరగాయలను కొని అందిస్తున్నారు.
Operation Rock Wallaby ?- #NPWS staff today dropped thousands of kgs of food (Mostly sweet potato and carrots) for our Brush-tailed Rock-wallaby colonies across NSW ?? #bushfires pic.twitter.com/ZBN0MSLZei
— Matt Kean MP (@Matt_KeanMP) January 11, 2020