జగన్ నెత్తిమీద పాలుపోయనున్న సుప్రీం కోర్టు ??

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ఆపేశారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని నిర్ణయించుకోవడం జరిగింది అని విమర్శించారు. అటువంటి ఎన్నికల కమిషనర్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ తో కూడా సంప్రదించకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.Image result for suprem court indiaముఖ్యంగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లా కి చెందిన ఎస్పీలను బదిలీ చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలే లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో 14వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 5 వేల కోట్లు ఈ ఎన్నికలు జరిగితే గాని రాని పరిస్థితి…ఇలాంటి టైమ్ లో చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాలకోసం వ్యవస్థలో తన మనుషులను ఉపయోగించుకుని ఎన్నికలను అడ్డుకోవడం దురదృష్టకరం అని వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు.

 

అయితే ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో గట్టి లాయర్ తో వైయస్ జగన్ వాదించటానికి చర్చలు జరుపుతున్నట్లు గట్టిగా వాదిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు పది రోజుల ముందే జరుపుకోవచ్చు అనే తీర్పు సుప్రీం కోర్టు నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా తీర్పు వస్తే జగన్ నెత్తిన సుప్రీంకోర్టు పాలు పోసినట్లు అవుతుందని…లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో 5 వేల కోట్ల నిధులు రావటం అంటే మామూలు విషయం కాదు అని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news