జగన్ సర్కార్ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ లో మరో షాక్ తగిలింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలను కొనసాగించేది లేదని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్ ఇప్పుడు తాజాగా మరో తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించాలని హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని తాజాగా సుప్రీం కోర్ట్ సమర్ధించింది. దీనితో సుప్రీంకోర్టులోజగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరు కాగా… సీజేఐ బాబ్డే, న్యాయమూర్తులు నాగేశ్వరరావు, సూర్యకాంత ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.

ఇటీవల రంగులు వేయడంపై పలువురు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వం సొమ్ముతో పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేయడంపై రాష్ట్ర హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా… వాటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా… ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దీనిపై సుప్రీం కోర్ట్ కి వెళ్ళగా సుప్రీం కోర్ట్ కూడా షాక్ ఇచ్చింది. రంగులు పార్టీ వి కాదని చెప్పినా కోర్ట్ వినలేదు.

Read more RELATED
Recommended to you

Latest news