సుప్రీమ్ కోర్ట్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసే అవకాశాలు ఎక్కువ ?

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ స్కాం కింద అరెస్ట్ అయ్యి 20 రోజులకు పైగానే అయింది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు బయటపడే దారి కనిపించడం లేదు. హై కోర్ట్ లో వేసిన క్వాష్ పిటిషన్ ను న్యాయమూర్తి కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు లాయర్లు ఈ కేసును మళ్ళీ సుప్రీమ్ కోర్ట్ లో కొంచెం ఆశతో వేశారు.. తెలుస్తున్న సమాచారం ప్రకారం పోలీసులు 17 A యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు.. కాబట్టి ఈ కేసును కొట్టివేయాలి మరియు విచారణను కూడా రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేశారు. కానీ ప్రముఖ న్యాయ నిపుణులు మరియు ఐటీ సలహాదారులు చెబుతున్న ప్రకారం ఈ చట్టంలో ఏ పబ్లిక్ సర్వెంట్ అనుమతిని తీసుకోవాలి అని ఉంది.. ఆ ప్రకారం చూస్తే ఎమ్మెల్యే, ఎంపీ, స్పీకర్, సీఎం లు పబ్లిక్ సర్వెంట్ లే అందుకే.. అరెస్ట్ చేసే ముందు స్పీకర్ అనుమతిని తీసుకోవాలి, ఆలా కాదు ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అంటే… ఆ చట్టంలోనే మూడు నెలల లోపల వరకు అనుమతి తీసుకోవాలి అని ఉంది.. ఆ ప్రకారం చూస్తే ఇంకా ఆ సమయం ఉన్నట్లే లెక్క.

ఈ విషయాన్ని సుప్రీమ్ కోర్ట్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని ఈ పిటిషన్ ను కొట్టివేస్తుంది అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news