నీట్​ పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టులో విచారణ

-

నీట్ పీజీ పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పరీక్ష వాయిదా వేయడం కుదరదని సుప్రీం కోర్టుకు నేషనల్ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ తెలిపింది . ఇప్పటికే 2లక్షల మందికిపైగా ఈ పరీక్ష కోసం నమోదు చేసుకున్నారని, వాయిదా వేస్తే దగ్గర్లో మరో తేదీ అందుబాటులో ఉండకపోవచ్చని చెప్పింది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్ల విచారణ సందర్భంగా తన అభిప్రాయాన్ని.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుప్రీం కోర్టుకు విన్నవించింది. శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్​ ఎస్​ఆర్​ భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.

నీట్​ పీజీ పరీక్షను వాయిదా వేయాలని, నీట్​ కౌన్సెలింగ్ ఆగస్టు 11 తర్వాత నిర్వహించాలని కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువురి పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు బెంచ్​ తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news