అంబానీ కుటుంబానికి సెక్యూరిటీ.. సుప్రీంకోర్టు ఆదేశం!

-

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబ భద్రత కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ముఖేష్ అంబానీతోపాటు అతని కుటుంబసభ్యులకు సెక్యూరిటీ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో ధర్మాసనం ఏర్పడింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది.

సుప్రీంకోర్టు-ముఖేష్ అంబానీ
సుప్రీంకోర్టు-ముఖేష్ అంబానీ

కాగా, అంబానీ కుటుంబానికి భద్రతను కల్పించడంపై బికేశ్ సాహు అనే వ్యక్తి త్రిపుర హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. దీంతో త్రిపుర హైకోర్టు రెండు సార్లు మధ్యంతర విచారణ జరిపింది. ఈ క్రమంలో అంబానీ కుటుంబంపై పొంచి ఉన్న ప్రమాదంపై నివేదికను తయారు చేసి.. కోర్టుకు హాజరుపర్చాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ముఖేష్ అంబానీ కుటుంబానికి భద్రతా కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news