అదానీ వ్యవహారంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

-

దేశవ్యాప్తంగా దుమారం రేపిన అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేంద్రం, సెబీ అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించింది. స్టాక్​ మార్కెట్​లో భారత మదుపర్ల పెట్టుబడులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఫిబ్రవరి 13 నాటికి సెబీ ప్రతిస్పందనను కోరింది.

ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో మదుపర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్ షేర్ల​ ‘కృత్రిమ క్రాష్​’ గురించి కూడా తెలియపరచాలని సూచించింది. నాయమూర్తులు జస్టిస్ పీఎన్​ నరసింహ, జస్టిస్ జేబి పార్ధివాలాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం.. నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాకుండా పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని నిర్దేశించింది.

సెబీ తరపున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్.. మార్కెట్ రెగ్యులేటర్, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని నివేదించారు. ఈ వ్యవహారంలో దాఖలైన రెండు పిల్​లకు సంబంధించి దర్యాప్తు కోసం​ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news