ఈ ఏడాది పూరి జగన్నాథుడి రథయాత్ర రద్దు: సుప్రీంకోర్టు

-

ప్రతియేటా అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది నిర్వహించవద్దని సుప్రీం కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది రథయాత్రను నిలిపివేయాలని కోరుతూ ఒడిశాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్డే, న్యాయమూర్తులు దినీష్ మహేశ్వరి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం దీనిపై గురువారం విచారణ జరిపింది. అనంతరం ఈ నెల 23 నుంచి జగవలసిన వేడుకలను కరోనా నేపథ్యంలో రద్దు చేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

కరోనా సంక్షోభ సమయంలో అంత పెద్ద రథయాత్రకు అంగీకరిస్తే జగన్నాథ స్వామి మమ్మల్ని క్షమించడు.. అని ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం, పౌరుల రక్షణ దృష్ట్యా చారిత్రక జగన్నాథుడి రథ యాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి వేడుకలు చేపట్టవద్దని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news