దేశంలో ఇప్పటి వరకు మహిళల జాతీయ కమిషన్ మాత్రమే ఉంది. ఇది ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా స్పందించి బాధ్యులకు తగిన శిక్ష వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. కాగా ఇదే విధంగా పురుషులకు కూడా ఒక జాతీయ కమిషన్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించిన కొందరు మేధావులు ఒక పిటీషన్ ను సుప్రీమ్ కోర్ట్ లో వేయడం జరిగింది. ఈ పిటీషన్ లో, ఒక పురుషుడు ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు… ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత గృహహింస తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పాయింట్ ను బలంగా చూపించే ప్రయత్నం చేశారు. సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఈ పిటీషన్ ను బాగా పరిశీలించి పురుషులకు జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయడం వీలు కాదు అంటూ ఈ పిటీషన్ ను కొట్టివేసింది. పిటీషన్ లో పొందుపరిచిన వివరణకు సుప్రీమ్ కోర్ట్ సంతృప్తి చెందక తిరస్కరించింది.
ఆత్మహత్యకు ఊరకే ఎవ్వరూ కమిట్ అవ్వరు… కేసులను బట్టి ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని చెప్పింది సుప్రీమ్ కోర్ట్.