పెగాసస్ పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

-

“పెగసస్” వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా పెగాసస్ వ్యవహారం పై అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యం లో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. పెగాసస్ పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.

supreme-court

ఈ వ్యవహారం లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ నిపుణుల కమిటీ కి సంబంధించి వచ్చే వారం ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఆయన ప్రకటన చేశారు. నిపుణుల కమిటీ విధివిధానాలను మరియు మార్గ దర్శకాలను… ఆ ఉత్తర్వులలో పేర్కొంటా మని జస్టిస్ ఎన్వి రమణ వెల్లడించారు. తాము వచ్చే వారం నాటికి సాంకేతిక నిపుణుల బృందంలోని సభ్యులను ఖరారు చేస్తామని CJI రమణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news