ఒడిషాకు షాకిచ్చిన సుప్రీం.. కొటియా గ్రామాల్లో యధావిధిగా ఏపీ ఎన్నికలు !

Join Our Community
follow manalokam on social media

సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ చేసింది. తమ భూభాగంలోని 3 పంచాయతీల పేర్లు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా పిటిషన్​ వేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. సీఎస్‌, ఎస్‌ఈసీ నుంచి సంజాయిషీ కోరి కారకులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసింది.  ఈ సందర్భంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న ఒడిశా ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.

దీంతో యధావిధిగా సాలూరు నియోజకవర్గంలోని  గంజాయ్‌భద్ర  గ్రామాల పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒడిశా దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం స్పందన తెలియ చేయాలని సుప్రీంకోర్టు కోరింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే అప్పటిదాకా ఎన్నికలు వాయిదా వేయాలని ఒడిశా తరపు న్యాయవాది కోరగా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం లేదని సుప్రీం కోర్టు  స్పష్టం చేసింది. దీంతో విజయనగరం కొటియా గ్రామాల్లో యధావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...