ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన సురామ పాధి.. రెండో మహిళ గా రికార్డు..!

-

ఒడిశా అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత సురామ పాధి ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ప్రొటెం స్పీకర్ ఆర్ఫీ స్వెన్ ఆమె ఎన్నికను ప్రకటించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బాధ్యతలు అప్పగించారు. దీంతో బీజేడీకి చెందిన ప్రమీలా మల్లిక్ తర్వాత ఒడిశా స్పీకర్గా ఎన్నికైన రెండో మహిళగా పాధి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, ఇతర సభ్యులు పాధికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పాధి మాట్లాడుతూ.. సభా గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నయాగఢ్ జిల్లాలోని రాన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పాధి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ- బీజేపీ కూటమి ప్రభుత్వంలో సహకార మంత్రిగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news