తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి : రాహుల్ గాంధీ

-

నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందించారు ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో విద్యా వ్యవస్థను బీజేపీ కబ్జా చేసిందని అన్నారు. నీట్ పరీక్షతో లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని తాను ఆపినట్లు చెప్పుకునే మోదీ పేపర్ లీక్ లను అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యారని చురకలు అంటించారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని.. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంట్ లో పోరాడుతామని అన్నారు.

 

విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారైందని అన్నారు. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లుగా పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యలే అని బీజేపీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందని అన్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదని చెప్పారు. వెంటనే నీట్‌ పరీక్షను రద్దు చేయాలని అన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారు? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news