‘సర్వే’ పాలిటిక్స్: సీట్ల లెక్కలు తేలిందా?

-

ఈ మధ్య తెలగాణ రాజకీయాల్లో ఎక్కువ చర్చ జరిగేది…ముందస్తు ఎన్నికల గురించి..అలాగే సర్వేల గురించి…ఈ రెండిటి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది…ఎప్పుడు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనేది పెద్ద చర్చ అయిపోయింది…ఇప్పటికే ముందస్తుపై అన్నీ పార్టీలు క్లారిటీగానే ఉన్నాయి…దీంతో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే సమయంలో ఈ మధ్య తెలంగాణలో వరుసపెట్టి సర్వేలు జరుగుతున్నాయని తెలుస్తోంది..ఓ వైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పీకే టీం ఓ సర్వే చేస్తుంది…అలాగే ప్రభుత్వం తరుపున ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే చేస్తున్నాయి.

అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం సర్వేలు చేయించుకుంటున్నాయని తెలుస్తోంది..అలాగే మూడు పార్టీల్లో ఉన్న నేతలు ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర సంస్థలు కూడా సర్వేల్లో మునిగితేలుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో సర్వేలు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు సర్వేల పేరిట…కొన్ని బయటకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే పీకే సర్వే పేరిట కూడా పలు కథనాలు వస్తున్నాయి.

తాజాగా సర్వేల గురించి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు…రాష్ట్రంలో ఏ సర్వే నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌తోపాటు రవిచంద్ర, మస్తాన్, రాష్ట్ర, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌… ఇలా పలు సంస్థలు సర్వేలు చేసి ఇటీవల కేసీఆర్‌కు నివేదిక అందించారని…ఆ నివేదికల్లో కాంగ్రెస్ పార్టీ ముందు ఉందని చెప్పారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్‌ఎస్‌కు 25 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 17 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని.. అలాగే కాంగ్రెస్‌ 32 స్థానాల్లో గెలుస్తుందని, మరో 23 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని,  బీజేపీకి 6 నుంచి 8 సీట్లలో గెలుపు, మరో 8 సీట్లలో పోటీలో ఉంటుందని, ఎంఐఎం 5 నుంచి 7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని పీకే రిపోర్టు తేల్చి చెప్పిందని అన్నారు..పీకే టీం మాత్రమే కాదు…మిగతా సర్వే సంస్థలు నివేదికల్లో ఇదే తేలిందని అంటున్నారు. అంటే రేవంత్ లెక్కల ప్రకారం చూస్తే..కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది..అటు బీజేపీ సర్వేలో ఆ పార్టీకి 30 సీట్లు వస్తాయని తేలింది…టీఆర్ఎస్ సర్వేల్లో ఆ పార్టీకి 40-50 సీట్లు వరకు వస్తాయని తేలిందని అంటుంది. మరి ఈ సర్వేల లెక్కల్లో ఏది నిజమో…కాదో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news