షాకింగ్ : సూసైడ్ చేసుకున్న సుశాంత్ స్నేహితుడు !

Join Our Community
follow manalokam on social media

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే చాలా మందిని కోల్పోయిన బాలీవుడ్ తాజాగా మరో నటుడిని కోల్పోయింది. ముంబై కి చెందిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన ఎంఎస్ ధోని బయోపిక్ లో సుశాంత్ స్నేహితుడిగా సహాయ పాత్రలో నటించాడు.. అలాగే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కేసరి అనే సినిమాలో కూడా నటించాడు.. అయితే ఈయన చనిపోవడానికి ముందు ఫేస్బుక్లో ఒక సూసైడ్ వీడియో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

తన భార్య, అత్త రెండేళ్లుగా తీవ్రంగా తమను వేధిస్తూ బెదిరిస్తున్నారని ఆయన వీడియోలో ఆరోపించాడు. తన భార్యతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సందీప్ తెలిపాడు. అయితే తన మృతికి ఎవరూ బాధ్యులు కారని పేర్కొన్న ఆయన దానికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారమని భావించానని చెప్పుకొచ్చాడు. సందీప్ ఉరి వేసుకొని మృతి చెందగా ఆ తరువాత గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...