సుశాంత్ కేసులో ఎయిమ్స్ కీలక రిపోర్ట్..

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో ఎయిమ్స్ కీలక రిపోర్ట్ సమర్పించింది. సుశాంత్ సూసైడ్ కేసును నిషితంగా పరిశీలించిన డాక్టర్లు తుది నివేదికను ప్రభుత్వానికి అందించారు. సుషాంత్ డెడ్ బాడీలో ఎలాంటి పాయిజన్ అవశేషాలు లేవని.. ఉరివేసుకోవడంతోనే సుశాంత్ చనిపోయాడని స్పష్టం చేశారు. DNA ను పూర్తిగా పరిశీలించన తర్వాతే…తుది నివేదికను ఇస్తున్నామని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు ఎయిమ్స్ డాక్టర్లు. గతంలో ముంబై డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులోని అంశాలే తమ పరిశీలణలో నిజమని తేలాయన్నారు.మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ సూసైడ్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు ఎయిమ్స్ డాక్టర్లు.

అనేక ఆరోపణల మధ్య సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించింది కేంద్రం. ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌కు ముమ్మాటికి ఆత్మహత్యేనని తేల్చింది. మరోవైపు అతడు చనిపోయిన తర్వాత జరిగిన విచారణలో డ్రగ్స్ దందా బయటపడింది. ఈ కేసులో ముందు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణ జరుపుతోంది. మరోవైపు గొంతు నులమడం వల్లే సుశాంత్‌ సింగ్‌ చనిపోయాడని ఆరోపిస్తున్నారు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌. తాను పంపిన సుశాంత్‌ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news