టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయిన నందమూరి తారకరామారావు అభిమానులు బాదపడుతున్నారు.. ఆవేదన చెందుతున్నారు. ఆయనకు దక్కాల్సిన గౌరవం ఆయనకు దక్కలేదని.. ఈ విషయంలో సొంతమనుషులే తోక అడ్డుపెడుతున్నారని.. లేదంటే ఆయనకు దక్కాల్సిన ఆ స్థాయి గౌరవం ఎప్పుడో దక్కేదని వాపోతున్నారు. ఈ మేరకు జగన్ కు వారు ఆన్ లైన్ వేదికగా ఒక రిక్వస్ట్ పెడుతున్నారు.. జగన్ ఆ విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నారు!
అవును… సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి “భారతరత్న” పురష్కారం ఇచ్చి గౌరవించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు! ఎస్పీబాలు నెల్లూరుకు చెందినవారు కావడం ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమని.. ఆయన అకాల మరణం దేశంలోని కళాభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత కుటుంబాన్ని విస్మయానికి గురిచేసిందని.. ఆయన విజయలా పరంపర అసాధారణమైనదని జగన్.. మోడీకి తెలిపారు!
నంది అవార్డులు, మరెన్నో లెక్కలేనన్ని పురష్కారాలు 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలను పొందిన ఆయన 2016లో సిల్వర్ పికాక్ మెడల్ దక్కించుకున్నారని లేఖలో వివరించారు జగన్. ఈ విషయాలన్నీ గ్రహించి… ఎస్పీబీకి భారత రత్న ఇవ్వాలని జగన్ ప్రధానిని కోరారు! దీంతో… ఎన్టీఆర్ కు కూడా ఆ పురస్కారం ఇప్పించే బాధ్యత కూడా జగన్ తీసుకోవాలని కోరుతున్నారు నందమూరి అభిమానులు!
నందమూరి తారకరామారావుకి భారతరత్న రాకుండా ఎవరు కేంద్రంలో తోకడ్డుపెట్టారనే విషయం అందరికీ తెలుసని.. ఆ విషయంలో ఎవరి వ్యక్తిగత ఈగోల వల్లో, దుర్మార్గపు ఆలోచనల వల్లో అన్నగారికి దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోకూడదని… ఆ విషయంలో ఎన్టీఆర్ ఆశయాలను సైతం తన పాలనలో పరిగణలోకి తీసుకుని ప్రజల్లో దూస్కుపోతున్న జగన్… ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో కేంద్రాన్ని సిఫార్స్ చేయాలని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్ ని కోరుకుంటున్నారు!!
ఈ విషయంలో జగన్ కూడా సానుకూలంగా స్పందించి… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మోడీకి లేఖ రాయాలని వారు విన్నవిస్తున్నారు!! అది జరుగుతుందని ఆశిస్తున్నారు!! జరగాలని ప్రార్థిస్తున్నారు!!
-CH Raja