తెలంగాణలోని 16 మున్సిపాలిటిలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఢిల్లీలో “స్వచ్ఛ సర్వేక్షణ్” అవార్డుల ప్రధానోత్సవం నిన్న రాత్రి జరిగింది. అయితే.. ఈ “స్వచ్ఛ సర్వేక్షణ్” అవార్డు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…అవార్డులు అందజేశారు. దేశంలో “స్వచ్ఛ సర్వేక్షణ్” అవార్డుల్లో రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు కేటిఆర్, కార్పొరేటర్లు.
2021-2022 సంవత్సరానికి గాను తెలంగాణలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు “స్వచ్ఛ సర్వేక్షణ్” అవార్డులు వచ్చాయి. ఇక తెలంగాణ కి అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారాలను, మరియు “గార్బెజ్ ఫ్రీ సిటీ” (జీఎఫ్‌సీ) అంశాల వారీగా స్టార్ రేటింగ్ ఇచ్చి (జూలై 2021 నుంచి జనవరి 2022 సంవత్సరానికి ) అవార్డులకు ఎంపిక అయ్యాయి.
అవార్డులు అందుకున్న 16 మున్సిపాలిటిలు, నగర పాలక సంస్థల ప్రతినిధులు.
1.ఆది బట్ల మున్సిపాలిటి
2. బడంగ్‌పేట్ మున్సిపాలిటి
3. భూత్పూర్ మున్సిపాలిటి
4. చండూర్ మున్సిపాలిటి
5. చిట్యాల మున్సిపాలిటి
6. గజ్వేల్ మున్సిపాలిటి
7. ఘట్ కేసర్ మున్సిపాలిటి
8. హుస్నాబాద్ మున్సిపాలిటి
9. కొంపల్లి మున్సిపాలిటి
10. కోరుట్ల మున్సిపాలిటి
11. కొత్తపల్లి మున్సిపాలిటి
12.నేరుడుచర్ల మున్సిపాలిటి
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటి
15. తుర్కయాంజల్ మున్సిపాలిటి
16. వేములవాడ మున్సిపాలిటి.
With the proud winners of #SwachhSurvekshan2022
Total 16 awards for Telangana Municipalities, highest ever for Telangana and 2nd most in India for a state
My compliments to the entire team of @TSMAUDOnline @arvindkumar_ias @cdmatelangana all Municipal Chairpersons, ACLBs & MCs pic.twitter.com/3pV9062xKm
— KTR (@KTRTRS) October 1, 2022