సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటారు. మీరు కూడా హోమ్ లోన్ తీసుకున్నారా..? అయితే తప్పక ఇది చూడాలి. పెరిగిన ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి రెపో రేటును పెంచేసింది ఆర్బీఐ. 5వ మానిటరీ పాలసీలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల ను పెంచుతున్నట్టు చెప్పింది.
దీనితో బ్యాంకులు కూడా లోన్స్ పై వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీలు మరియు కొన్ని బ్యాంకులు కూడా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ల పెంచేస్తున్నాయి. అయితే ఇందులో స్టేట్ బ్యాంక్ కూడా వుంది. ఇక ఎస్బీఐ ఏం అంటోందో చూస్తే… రెపో అనుసంధానిత లెండింగ్ రేటును, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుని యాభై బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్టు చెప్పింది.
ఈబీఎల్ఆర్‌ను 8.55 శాతానికి, ఆర్‌ఎల్ఎల్ఆర్‌ను 8.15 శాతానికి పెంచేసింది బ్యాంక్. ఇవి ఇప్పుడు అమలులోకి వచ్చాయి. మొత్తానికి వీటి వలన హోమ్ లోన్ ఈఎంఐలు పెరగనున్నాయి. ఎంత మేర పెరిగాయనేది చూస్తే.. 20 ఏళ్ల టెన్యూర్ కోసం రూ.35 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే 8.05 శాతం వడ్డీ రేటు పడితే ఇప్పుడు 8.55 శాతానికి చేరింది. స్టేట్ బ్యాంక్ వడ్డీ రేటుని పలు అంశాలను బేస్ చేసుకుని నిర్ణయిస్తుంది.