ఆ డైరెక్టర్ ప్రతిరోజు బూతులు తిట్టేవారు.. బొంబాయి పద్మ షాకింగ్ కామెంట్స్.!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బొంబాయి పద్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని దర్శకుడు తేజ గురించి పలు షాకింగ్ కామెంట్లు చేసింది. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కిన నిజం సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఇక ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. మా బ్రదర్స్ ఆఫీసర్స్ స్టేజ్ లో ఉన్నారు.. నాకు అభ్యంతరంగా ఉండే వేషాలు నచ్చవు అని, ఇక మన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తే బాధగా ఉంటుంది అంటూ ఇలా రకరకాలుగా కామెంట్లు చేసింది. ముఖ్యంగా మనం ఏడవాలంటే కూడా ఆ కన్నీళ్ళ విలువ ఉండాలని కూడా ఆమె చెప్పుకొచ్చింది..

నేను ఇస్తానన్న కట్నం కూడా ఇవ్వలేకపోయాను.. కానీ అల్లుడు వాళ్ళు సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించారు అంటూ బొంబాయి పద్మ తెలిపింది. ఇక కెరియర్ లో ఎన్నోసార్లు మోసపోయాను అని , వినే వాడికి చెప్పేవాడు లోకువ అన్నట్టుగా తన జీవితం మారిపోయింది అని కూడా కామెంట్లు చేసింది. ఇక నిజం సినిమా సమయంలో దర్శకుడు తేజ తనను బాగా తిట్టారు అని కూడా ఆమె చెప్పుకు వచ్చింది.. ఆయన కోపంతో మైకు చేతిలో ఉన్నా కూడా బూతులు తిట్టారు అని ఆమె తెలిపింది. సెట్ లో అందరూ డైరెక్టర్ తేజ తో జాగ్రత్తగా ఉండేవారు. లేకపోతే కోపం తెప్పిస్తే అందరి ముందే బూతులు తిట్టేవారు అంటూ ఆమె తెలిపింది.

Teja to handle two Hindi projects - Telugu News - IndiaGlitz.com

తేజ తిట్టినప్పుడు తనకు కోపం రాలేదు అని తాను కోపం తెప్పించడం వల్ల ఆయన తనను తిట్టారు అని కూడా ఆమె భావించినట్లు స్పష్టం చేశారు. ఇక ఆయన మనసులో ఏదో పెట్టుకుని ఎప్పుడూ తిట్టరని కూడా చెప్పుకొచ్చింది.. ఇక నేను ఒక మంచి ఆర్టిస్ట్ అని తేజ కూడా ఎప్పుడు ఒప్పుకుంటారు అని ఆమె తెలిపింది.. నిజం సినిమాలో మహేష్ బాబు అత్త అని తనను పిలిచేవారని, అంతే కాదు తిట్లు బాగా పడ్డాయి అంట కదా అని హేళన కూడా చేసేవారు అంటూ ఆమె సరదాగా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news