శ్రీ సీతారాముల ఆలయంలో స్వామి వారి విగ్రహాలు ధ్వంసం..!

-

హైదరాబాద్ నగరంలోని శ్రీ సీతారాముల ఆలయంలో  గుర్తుతెలియని దుండగులు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ X పరిధిలోని దుబిల్పురా గ్రామంలో చోటుచేసుకుంది. శ్రీ సీతారాముల ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. దుండగులు రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అక్కడి స్థానికులు తెలుపుతున్నారు.

ఈ ఘటన జరిగిన తర్వాత ఆలయ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, విగ్రహాలు ధ్వంసమైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై ఆగ్రహించిన స్థానికులు విగ్రహాలు నాశనం చేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news