కాంగ్రెస్ పార్టీ లో చాలా వరకు కూడా ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసే విధంగానే అడుగులు వేస్తున్నారు కొందరు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి మాట వినడానికి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధంగా లేరు. 2018లో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నాలు చేశారు అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ వస్తున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ పదవి చేపడితే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది షర్మిల వైపు చూస్తున్నారని సమాచారం.
రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక చాలామంది నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ఆమె వైపు వెళ్లడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కొందరు నేతలు చెప్పారట. అయితే రేవంత్ విషయంలో కాంగ్రెస్ ఆలోచించాల్సినసమయం వచ్చిందని లేకపోతే మాత్రం ప్రధానంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉన్నాయని అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.