టీ-20 మ్యాచ్.. రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..!!

భారత్-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ విశాఖపట్నం కేంద్రం కానుంది. ఈ నెల 14వ తేదీన విశాఖలో జరగబోయే టీ-20 మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రోజువారి మార్గాల్లో వెళ్లే వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే భారీ వాహనాలు లంకెనపాలెం నుంచి సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. విశాఖనగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలు ఎన్ఏడీఏ, పెందుర్తి, ఆనందపురం వైపుగా ఎన్ఏడీ, హన్మంత వాక నుంచి శ్రీకాకుళం వెళ్లాలని, విజయనగరం వెళ్లే వాహనాలను హన్మంతవాక, అడవివరం, కస్తూరపురం జంక్షన్ మీదుగా మళ్లిస్తారని పేర్కొన్నారు.

అలాగే శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖకు వెళ్లడానికి అనకాపల్లి, ఆనందపురం, పెందుర్తి మీదుగా రావాలన్నారు. మ్యాచ్ ప్రారంభమైన గంట తర్వాత జాతీయ రహదారిపై రాకపోకలకు అనుమతి లేదన్నారు.