ఈ నెల 21 నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 21 న బాపట్ల జిల్లాలో 8 వ తరగతి విద్యార్ధులకి సీఎం ట్యాబ్ లు పంపిణీ చేస్తారని.. 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్ధులు, ఉపాధ్యాయులకి ఈ ట్యాబ్ లు ఇస్తామని వెల్లడించారు.
ఇందు కోసం 686 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. బైజూస్ కంటెంట్ ని ట్యాబ్‌లలో అప్ లోడ్ చేసి ఇస్తామన్నారు. మూడేళ్ల వారంటీ ఉంటుందని.. అత్యుత్తమ విద్యాబోధన అందించేందుకే ఈ ట్యాబ్ ల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. చుండూరు మండలం యడ్లపల్లి హైస్కూలులో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. వచ్చే ఏడాది నుంచి వెయ్యి హై స్కూళ్లను సిబిఎస్ఇ పాఠశాలలుగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. సీబీఎస్ఈకి అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేసి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలని ఇకపై వినియోగిస్తామని..ఉపాధ్యాయ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అడిగిన సవరణల పై కూడా సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.