వేసవి కాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది నిమ్మరసం తాగుతుంటారు. కొందరు నిమ్మరసాన్ని తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే నిజానికి నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఏ సీజన్ అయినా సరే.. నిత్యం ఇలా చేస్తే.. కింద తెలిపిన 5 వ్యాధులు మీ దగ్గరికి రావు. మరి ఆ వ్యాధులు ఏమిటంటే..
* జీర్ణ సమస్యలతో సతమతమయ్యే వారు నిత్యం నిమ్మరసం తాగితే మంచిది. జీర్ణ వ్యవస్థలో ఉండే లోపాలు తొలగిపోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కొందరు నిమ్మరసం తాగితే గ్యాస్, అసిడిటీ వస్తుందని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. కనుక నిత్యం నిమ్మరసం తాగితే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే శరీరంలో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* నిమ్మరసాన్ని నిత్యం తాగితే శ్వాస కోశ సమస్యలు రావు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు సమస్యలు బాధించవు. నిమ్మరసం ఉండే విటమిన్ సి, ఇతర పోషకాలు ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
* కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు నిత్యం నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. అయితే ఆరోగ్యవంతులు కూడా ఈ రసాన్ని తాగవచ్చు. దీంతో వారికి కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి.
* అధిక బరువు సమస్య ఉన్నవారు నిత్యం నిమ్మరసం తాగడం వల్ల దాని బారి నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గుతారు. అలాగే నిమ్మరసం తాగడాన్ని కొనసాగిస్తుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు పెరగకుండా ఉంటారు.
* డీహైడ్రేషన్ సమస్య ఉన్నవారికి నిమ్మరసం ఎంతగానో మేలు చేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీని వల్ల డీహైడ్రేషన్ రాదు. అలాగే నోరు పొడిబారకుండా ఉంటుంది.