మాస్క్ లేని వారి విషయంలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు సీరియస్ గా ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా సరే ప్రజలు మాస్క్ ధరించడం లేదు. కొంత మంది ఇబ్బందితో మరికొంత మంది అందం చూపించుకోవడానికి ధరించడం లేదు. అయితే ప్రభుత్వాలు మాత్రం ఫైన్ వేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదు. గుజరాత్ లో మాస్క్ ల పుణ్యమా అని ఆదాయం భారీగా పెరిగింది.
మాస్క్ లేదని గుజరాత్ లో ఏకంగా ప్రజల నుంచి కేవలం 5 నెలల్లో 76 కోట్లను వసూలు చేసారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. గుజరాత్ లో కరోనా మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే కరోనాను ప్రజలు పట్టించుకోవడం లేదు. అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటు ఉందని నివేదికలు చెప్తున్నాయి.