అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మంది అనేక రకాల విధానాలను పాటిస్తుంటారు. కొందరు వ్యాయామంపై ఎక్కువగా దృష్టి పెడతారు. కొందరు యోగా చేస్తారు. ఇక కొందరు క్రీడలకు ప్రాధాన్యతనిస్తారు. ఇంకా కొందరు ఏదైనా ఒక వైద్య విధానంలో బరువును తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే కొందరు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవాలని యత్నిస్తుంటారు. అయితే ఎవరైనా సరే.. ఆహారం విషయానికి వస్తే.. కింద సూచించిన పలు ఆహారాలను నిత్యం తీసుకోవాల్సిందే.. దీంతో అధిక బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
సోయామిల్క్…
సోయామిల్క్‌లో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రింక్ చక్కగా పనిచేస్తుంది. అయితే బరువు తగ్గేందుకు కొందరు బాదం పాలు మంచివని భావిస్తుంటారు. అయితే అది నిజమే అయినా ఆ పాలలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. కనుక ప్రోటీన్లు కావాలంటే సోయామిల్క్‌ను తాగాల్సిందే.
గ్రీన్ టీ…
వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నవారికి గ్రీన్ టీ ఎంతగానో మేలు చేస్తుంది. నిత్యం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తేలిగ్గా తగ్గవచ్చు. కొవ్వును కరిగించే ఔషధాలు గ్రీన్ టీలో ఉంటాయి. గ్రీన్ టీని తాగితే కేవలం వారం రోజుల్లోనే శరీరంలో గమనించదగిన మార్పు మనకు కనిపిస్తుంది.
నీరు…
ప్రతి ఒక్కరూ నిత్యం తగినంత నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం నీటిని అమృతంలా భావించాలి. ఎందుకంటే నీటిని ఎక్కువగా తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు 2 గ్లాసుల నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా క్యాలరీలు తక్కువగా అంది, శరీర బరువు త్వరగా తగ్గుతుంది.
ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్…
కీరదోస, టమాటా, బీట్‌రూట్, పాలకూర, క్యారెట్ తదితర కూరగాయలతో తయారు చేసిన తాజా వెజిటబుల్ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. అలాగే ఆకలి అదుపులో ఉంటుంది. శరీరానికి పోషణ కూడా అందుతుంది.
బ్లాక్ కాఫీ…
చక్కెర లేకుండా బ్లాక్ కాఫీని తాగినా అధిక బరువు తగ్గుతారు. కాఫీలో ఉండే ఔషధ కారకాలు కొవ్వును కరిగిస్తాయి. శరీరంలో కరగకుండా ఉండే ఎంతటి మొండి కొవ్వునైనా కాఫీ కరిగిస్తుందని పలువురు సైంటిస్టులు చేసిన పలు పరిశోధనలు చెబుతున్నాయి. కనుక నిత్యం బ్లాక్ కాఫీని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.