గత కొంత కాలంగా ఆందోళన కలిగిస్తున్న బంగారం ధర ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. దేశీయంగా గత పది రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు కాస్త దిగి వస్తున్నాయి. సోమవారం 200 కి పైగా తగ్గిన బంగారం ధర… మంగళవారం మరో వంద రూపాయలు తగ్గింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 తగ్గుదలతో రూ.45,800కు దిగి వచ్చింది.
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గడంతో… రూ.41,980కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ రూ.110 మేర దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గడంతో… రూ.42,850కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే, రూ.110 క్షీణతతో రూ.44,050కు తగ్గింది. ఇక వెండి ధర కూడా రూ.450 తగ్గుదలతో రూ.49,500కు తగ్గింది.
వెండి ధర కూడా తగ్గింది. కేజీ వెండి ధర రూ.450 మేర తగ్గింది. కేజీ వెండి ధర రూ.49,500కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగి వచ్చింది. 1700 డాలర్లకు దిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డిమాండ్ లేకపోవడమే అంటున్నారు. కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అందుకే బంగారం ధరలు తగ్గాయని అంటున్నారు.