మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ గుండె చాలా ముఖ్యమైంది. ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. నిరంతరాయంగా గుండె పనిచేస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలి. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయడంతోపాటు తగినన్ని గంటలు నిద్రపోవాలి. సరైన పోషకాలు ఉండే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
1. ఓట్ మీల్
ఓట్‌మీల్ మనకు సంపూర్ణ పోషణను అందిస్తుంది. ఇందులో మన శరీరానికి నిత్యం అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా ఉంటాయి. ఓట్‌మీల్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్‌మీల్‌ను నిత్యం తీసుకుంటే గుండెను సంరక్షించుకోవచ్చు.
2. యాపిల్స్
యాపిల్స్ మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. గుండెను రక్షించే పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అందువల్ల వీటిని నిత్యం తినాలి.
3. బీన్స్
చిక్కుడు జాతికి చెందిన కూరగాయలను నిత్యం తినడం వల్ల వాటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, ఇతర పోషకాలు మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.
4. ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయల్లో ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను సంరక్షిస్తాయి. అందువల్ల వీటిని తరచూ తీసుకుంటే మంచిది.
5. ఇతర కూరగాయలు
బీరకాయ, కాకరకాయ, సొరకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్ తదితర కూరగాయలను కూడా తరచూ తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.