కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి శుక్రవారం మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చిన రిజల్ట్ సీన్ చూశాక.. ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని ఉత్తంకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని తెలిపారు.

జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుఫరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందని విమర్శించారు. వర్షకాలం వస్తోన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news