ఎన్డీయే కూటమి నేతలు మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటల తర్వాత రాష్ట్రపతి దౌపది ముర్మును కలవనున్నారు. రాష్ట్రపతిని కలిసి.. కేంద్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము సంసిద్ధతతో ఉన్నామని ,తమ కూటిమికి మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందజేయనున్నారు.
ఇక.. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇందులో మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తర్వాత మోడీ తనకు మూడో సారి అవకాశం కల్పించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలువగా.. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేకపోయింది. దీంతో బీజేపీ కూటమిలోని మిత్ర పక్షాల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టనుంది.ఇక ఎల్లుండి మోదీ సాయంత్రం 6 గంటకు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.