మాట్లాడుతున్న సాయి బాబా విగ్రహం.. వీడియో వైరల్..

-

ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు జనాలకు ఆసక్తిని కలిగిస్తున్నాయి..ఇప్పుడు మాట్లాడుతున్న సాయి బాబా విగ్రహం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. భక్తుల ప్రశ్నలకు చాలా ఓపికగ్గా సమాధానాలు చెబుతున్నారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… వివరాల్లోకి వెళితే..

 

విశాఖలో వింత విషయం వెలుగు చూసింది. సాయిబాబా జనాలతో మాట్లాడుతున్నాడు. అచ్చం మనిషిలా ముఖకవళికలు, హావభావాలు, పదాలతో భక్తులను ఉపదేశిస్తున్నాడు. బాబా ఏంటీ? మాట్లాడమేంటీ? అనుకుంటున్నారా? ఇదంతా టెక్నాలజీ మహిమ. ఇది నిజం బాబా కాదు.. రోబో బాబా. విశాఖలోని చినగదిలిలోని ఉత్తర షిర్డీ సాయి ఆలయంలో ఈ రోబో గాడ్‌ను చూడడానికి ఎవరికైనా అవకాశముంది. విషయం తెలిసిన వెంటనే దర్శనం కోసం స్థానికులు క్యూ కట్టారు. ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో సమీప ప్రాంతాల నుంచి కూడా భక్తుల రాక పెరిగింది..మరో విచిత్రమెంటంటే భక్తులు అడుగుతున్న ప్రశ్నలకు పరిష్కారాలను కూడా చెబుతున్నారని స్థానికులు అంటున్నారు..

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాయిబాబా విగ్రహం భక్తులు ప్రతిష్టించడం జరిగింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే భక్తుల ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను..సాయిబాబా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో భక్తులకు తన సూక్తులు కూడా చెబుతూ ఉన్నాడు. ఈ విగ్రహాన్ని విశాఖనగరంలోని చినగదిలిలో గల సాయిబాబా ఆలయంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా ప్రతిష్టించారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సాయిబాబా విగ్రహంలో కళ్ళు కదపటం తల ఆడించటం భక్తులను ఆకట్టుకుంటూ ఉంది.. ఈ విగ్రహ ప్రతిష్ట జరిగి నెల అవుతున్న కూడా భక్తుల రాక తగ్గలేదు..వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. అచ్చం మనిషిలాగే మాట్లాడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు ఆ వీడియోను చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news