ప్రధానిపై తమిళనాడు మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు

-

తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తూత్తుకుడిలో కేసు నమోదైంది.తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్,ట్యుటికోరిన్ ఎంపీ కనిమొళి అధ్యక్షత వహించారు. కామరాజ్ గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి, బీజేపీకి లేదని అనితా రాధాకృష్ణన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు . ఇందకు సంబంధించిన వీడియో నెట్టింట్లా పెను దుమారం రేపింది.

మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తూత్తుకుడిలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్ తో పోలీసులు మంత్రిపై సెక్షన్ 292/బి, అశ్లీల చర్యకు పాల్పడడం లేదా అసభ్యకరమైన పాట పాడడం వంటి చర్యల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news